తుమ్మలచెరువుకు పర్యాటక కళ!
అశ్వాపురం, అక్టోబర్ 8 (విజయక్రాంతి): మండలంలోని కాకతీయుల కాలం నాటి చారిత్రక తుమ్మలచెరువును(Thummalacheruvu) గురువారం జిల్లా పంచాయతీ అధికారి అనూష(District Panchayat Officer Anusha) సందర్శించారు. చెరువులో కొనసాగుతున్న బోటింగ్ నిర్వహణతో పాటు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసే అవకాశాలపై ఆమె పరిశీలించారు.
పర్యాటకులను ఆకర్షించే విధంగా అవసరమైన మౌలిక వసతులు, బోటింగ్ సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న తుమ్మలచెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై స్థానికుల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ముత్యాలరావు, బోటింగ్ నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.