భూముల రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలి

08-10-2026 | 06:58pm

ఆసిఫాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): జిల్లాలో భూముల రీ సర్వేను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ కె.హరిత(Collector K. Haritha) అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో(Collectorate) రెవెన్యూ సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. డీజీపీఎస్‌ రోవర్ల ద్వారా భూముల కొలతలు చేపట్టే విధానంపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ప్రభుత్వ భూములు, ఆస్తుల సర్వేను పక్కాగా నిర్వహించి, భవిష్యత్తులో హద్దుల వివాదాలకు తావులేకుండా రెవెన్యూ రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు