రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఏర్పాట్లు

08-10-2026 | 07:32pm

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని మోడల్ స్పోర్ట్స్ ఆశ్రమ పాఠశాలలో ఈ నెల 11 నుంచి జరగనున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల(State level sports competitions) ఏర్పాట్లను డీడీ జాదవ్ అంబాజీ(DD Jadhav Ambaji) గురువారం పరిశీలించారు. మైదానం, భోజనం, వసతి, పరిశుభ్రత తదితర ఏర్పాట్లను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు.

క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి. లింబారావు, పీడీ గుండం లక్ష్మణ్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు