ఆలేరు సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు విస్తృత సేవలు...

29-09-2026 | 06:25pm

ఆలేరు, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఆలేరు వ్యవసాయ సహకార పరపతి సంఘం(Aleru Cooperative Society) ఆధ్వర్యంలో రైతులకు విస్తృత సేవలు అందిస్తున్నట్లు సంఘం చైర్మన్ జనగాం ఉపేందర్ రెడ్డి తెలిపారు. 2026 రబీ సీజన్‌లో 1,923 మంది రైతుల నుంచి 2,79,519 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి, రూ.26.51 కోట్లకు పైగా చెల్లించినట్లు పేర్కొన్నారు. సంఘం పరిధిలోని మూడు గోదాముల ద్వారా ఎరువులు, విత్తనాల సేవలు అందిస్తున్నామని, 6,673 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు.

1,633 మంది రైతులకు రూ.12.01 కోట్ల పంట రుణాలు, 255 మందికి రూ.11.33 కోట్ల దీర్ఘకాలిక రుణాలు ఉన్నట్లు వెల్లడించారు. గత ఆరు నెలల్లో 25 మందికి రూ.95.25 లక్షల డెయిరీ రుణాలు, ఒకరికి రూ.8 లక్షల గొర్రెల పెంపకం రుణం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోర్తల మోహన్ రెడ్డి, బండ వీరమల్లయ్య, మారోతు శ్రీను, బీసు నరహరి, చెక్క వెంకటేశ్, చాడ రాజు, బొమ్మకంటి లక్ష్మీనారాయణ, సుక్క యాదమ్మ, ఆలకుంట్ల స్వరూప, పల్లెపల్లి శ్రీనివాస్, జిన్నె బిక్షపతి, సందేపల్లి ముత్తయ్య, ఇందూరి వెంకటరెడ్డి (కార్యదర్శి), ఫీల్డ్ ఆఫీసర్ పోతిరెడ్డి తదితరులు రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు