దళారుల చేతుల్లో రైతులు మోసపోకండి

30-10-2026 | 08:23pm

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాలను విక్రయించండి

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): రైతులు(Farmers ) దళారుల చేతుల్లోకి మోసపోకండి ప్రభుత్వం  కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించండి అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Government Whip Birla Ilaiah) రైతులను కోరారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలం(Yadagirigutta mandal)లోని  గౌరాయిపల్లి, కాచారం గ్రామాల్లో ఐకెపి  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య  ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్, డైరెక్టర్లు సర్పంచ్, వార్డ్ మెంబర్లు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు