కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

01-10-2026 | 10:29pm

కొడిమ్యాల,(విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి(Kondagattu Anjaneya Swamy)ని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్(Collector Satya Prasad) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో అంజనా రెడ్డి ఆలయ మర్యాదలతో జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం కలెక్టర్ కు తీర్థప్రసాదాలు అందజేసి, స్వామి వారి శేష వస్త్రంతో  సత్కరించారు. ఈ కార్యక్రమంలో  సూపరింటెండెంట్ సునీల్ కుమార్, ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, ఇన్స్పెక్టర్ అశోక్, ఆలయ సిబ్బంది,అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు