అర్హుల ఓట్లు తొలగించిన జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలి

23-10-2026 | 04:23pm

ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా..

ఆలేరు, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను(Election Commissioner Gyanesh Kumar) పదవి నుంచి తొలగించి విచారణ జరపాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఆలేరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అర్హుల ఓటు హక్కులను పునరుద్ధరించాలని, ఎన్నికల కమిషన్ పనితీరుపై విచారణ జరపాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు రైతులు, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు మామిడాల సోమయ్య, చిరబోయిన రాజయ్య, మామిడాల బాల మల్లేష్, తమ్మడి అంజయ్య, బర్మా బాబు, చిరబోయిన కొమరయ్య, పద్మ సుదర్శన్, మేకల వెంకటేష్, కుర్రి సత్యనారాయణ, రామచంద్రు, ఐలయ్య, కడకంచి స్వామి, సుంచు రాములు, ఆర్. ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు