శవాల కోసం ఫ్రీజర్ కొనుగోలు
ఆదర్శం బోథ్ అభివృద్ధి కమిటీ.
బోథ్ అక్టోబర్ 23. (విజయ క్రాంతి) మండల కేంద్రానికి చెందిన గ్రామ అభివృద్ధి కమిటీ(Village Development Committee) వారు ప్రజల అవసరాలను గుర్తించి ఇటీవల శవాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్ కొనుగోలు చేయడం జరిగింది. ఒకప్పుడు ఫ్రీజర్ అవసరం అంతగా లేకుండేది. కార్యక్రమంలో శవాల ను భద్రపరిచేందుకు ఫ్రీజర్ అవసరం ఏర్పడు తుండడంతో,ప్రజల కోరిక మేరకు ఫ్రీజర్ ను కొనుగోలు చేయడం జరిగిందని గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ అల్లకొండ పోతన్న పేర్కొన్నారు.
ఫ్రీజర్ లేక ఇబ్బందులు ...
ఎవరైనా చనిపోతే వారి శవాలను భద్రపరిచేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు మృతుల బంధువులు దగ్గర్లో ఉండడం వల్ల అంత్యక్రియలు సకాలంలో జరిగేవి. అయితే ప్రస్తుత సమయంలో పెద్ద మొత్తంలో కుటుంబీకులు ఉన్నత చదువుల కోసం ఉద్యోగాల కోసం పట్టణాలలో ఉండడం వల్ల వారు వచ్చేంతవరకు శవాలను భద్రపరచడం ప్రారంభించిన భారంగా మారుతున్నది. దీంతో ఫ్రీజర్ అత్యవసర వస్తువుగా మారిందని తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్రీజర్ను కొను గోలు చేశామని ఆయన తెలిపారు. ఏది ఏమైనా గ్రామాభివృద్ధి కమిటీ వారు తీసుకున్న నిర్ణయం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచిందని పలువురు పేర్కొంటున్నారు.