ఇందిరమ్మ ఇండ్లు పనులను పరిశీలించిన హోసింగ్ పీడీ మాణిక్యం

23-10-2026 | 04:38pm

చేగుంట ,అక్టోబర్ 23, విజయక్రాంతి : చేగుంట మండలంలోని రెడ్డిపల్లి గ్రామపంచాయతీనీ(Reddipalle Gram Panchayat) జిల్లా పీడీ మాణిక్యం స్థానిక తాసిల్దార్ బాల్ లక్ష్మి(Tahsildar Bal Lakshmi) తో కలిసి   శుక్రవారం సందర్శించడం జరిగింది.గ్రామంలోనీ ఇందిరమ్మ ఇండ్ల(Indiramma Houses) ను పరిశీలించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Houses) ఎన్ని మంజూరయ్యాయని,ఎన్ని పూర్తయ్యాయని తెలుసుకున్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లబ్ధిదారులు(Beneficiaries) ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాల్ లక్ష్మి, హోసింగ్ ఏ ఈ పియాజుద్దీన్, ఆర్ ఐ జై భరత్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ సమినా సుల్తాన,,కాంగ్రెస్ నాయకులు నాగరాజు,వార్డు సభ్యులు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు