ఎండిన పంటలకు నష్టపరిహారాన్ని చెల్లించాలి...
సిపిఎం మండల కార్యదర్శి గడ్డం వెంకటేష్......
యాదగిరిగుట్ట, అక్టోబర్ 23 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట మండలం వ్యాప్తంగా ఎండిన పంటలను స్థానిక వ్యవసాయ అధికారులు(Local agricultural officials) క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారాన్ని చెల్లించాలని సిపిఎం మండల కార్యదర్శి గడ్డం వెంకటేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం గౌరాయపల్లి గ్రామంలో ఎండిపోయిన పంటను పరిశీలన చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ ఎండిన పంటలను అధికారులు ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు.
యాదగిరిగుట్ట మండల గౌరాయపల్లి గ్రామంలో బుల్లె ఐలయ్య, బైరా ఐలయ్య, వడ్లకొండ వెంకటేశం, వడ్లకొండ శంకరయ్య రైతుల పంట పొలాలు పూర్తిగా ఎండిపోయి సుమారు 60నుండి70 వేల వరకు పంట నష్టం జరిగిందని అన్నారు. ఒకవైపు ఎల్ నినో ప్రభావం మరోవైపు సాగునీటి ప్రాజెక్టులపై పాలకులు దృష్టికి పెట్టకపోవడంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు.
వ్యవసాయ అధికారులు స్థానిక శాసన సభ్యులు ఎండిపోయిన పంటలను క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంట నష్టాన్ని అంచనా వేసి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని లేనియెడల తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి ఇంజ లింగం, మండల కమిటీ సభ్యులు బబ్బూరి శ్రీనివాస్,వడ్లకొండ బిక్షపతి,రైతులు బుల్లె అయిలయ్య, అత్కూరి అయిలయ్య, వడ్లకొండ వెంకటేశం,వడ్లకొండ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.