పోలీస్ బాస్‌ల భేటీ
హైదరాబాద్‌లో దక్షిణాది DGPల కీలక సదస్సు.. Cyber Crime, Drugsపై ప్రత్యేక ఫోకస్!
హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల మధ్య పోలీస్ సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, అంతర్రాష్ట్ర నేరాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో నేడు కీలక సమావేశం జరగనుంది. బంజారాహిల్స్‌లోని Telangana Integrated Command and Control Centreలో నిర్వహించనున్న Southern Region Police Coordination Committee (RPCC) Conferenceకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సదస్సులో పలు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు, కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా Cyber Crime, Drug Trafficking, Terrorism, Organised Crime వంటి అంశాలపై చర్చించనున్నారు. ఒక రాష్ట్రంలో నేరం చేసి మరో రాష్ట్రంలో తలదాచుకునే ముఠాల కదలికలను గుర్తించడం, నేరగాళ్ల సమాచారాన్ని వేగంగా పంచుకోవడం, Intelligence Sharingను మెరుగుపరచడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పోలీసింగ్‌లో Artificial Intelligence (AI) వినియోగం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ, మావోయిస్టు ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పాటు లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి నుంచి DGPలు, సీనియర్ పోలీస్ అధికారులు హాజరుకానున్నారు. IB, CBI, NIA, NCB, BSF, CRPF వంటి కేంద్ర సంస్థల ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు. ఈ సదస్సులో జరిగే చర్చలు, సమన్వయ నిర్ణయాలు అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణకు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందించడంపై దృష్టి సారించనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా మధ్యాహ్నం బోధి పెవిలియన్‌లో నీటిపారుదల శాఖపై Review Meeting నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం ప్రజాభవన్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నీటిపారుదల అంశాలతో పాటు పార్టీ, ప్రజాప్రతినిధులకు సంబంధించిన అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.