సిఇసి జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం
23-10-2026 | 04:43pm
నిర్మల్ అక్టోబర్ 23 ( విజయక్రాంతి): సీఈసీ జ్ఞానేష్ కుమార్(CEC Gyanesh Kumar) వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదురుగా జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కమిషనర్ కు వ్యతిరేకంగా కార్మిక సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి అఖిలభారత రైతు కూలి సంఘం రాష్ట్ర,ఉపాధ్యక్షులు. జె.రాజు ,టి యు సి ఐ జిల్లా కార్యదర్శి ఆర్ రామ లక్ష్మణ్,అధ్యక్షులు మద్దెర్ల బక్కన్న తదితరులు పాల్గొన్నారు.