యూసీఎఫ్ ప్రాజెక్టు ప్రక్రియను వేగవంతం చేయాలి

23-10-2026 | 04:35pm

కమీషనర్ ప్రఫుల్ దేశాయ్

​ముకరంపుర, అక్టోబర్ 23(విజయక్రాంతి) : అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం(Urban Challenge Fund Scheme) కింద కరీంనగర్ నగరంలో చేపట్టబోయే అభివృద్ధి పనుల ప్రక్రియను వేగవంతం చేయాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్(Commissioner Praful Desai) కన్సల్టెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం(Karimnagar Municipal Corporation Office) నుండి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు.  యూసీఎఫ్ పథకం(UCF Scheme) పరిధిలో చేపట్టబోయే వివిధ ప్రాజెక్టుల ప్రతిపాదనలు, సాంకేతిక అనుమతులు(Technical Approvals), టెండర్ల ప్రక్రియల తదితర అంశాల పై లోతుగా చర్చించారు.

ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్బన్ చాలేంజ్ ఫండ్ పథకం లో రూపొందించిన ప్రాజెక్టుల ప్రతిపాదనల ప్రక్రియను వేగవంతం చేసి... అభివృద్ధి పనులు చేపట్టేలా తగిన చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో రోడ్లు, వరద మురుగు నీటి కాలువల నిర్మాణ అభివృద్ధికి సంబంధించిన రెండు కీలక డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టుల ప్రాసెస్ వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు.

వీటిని వెంటనే సాంకేతిక అనుమతులు  టెండర్ ప్రక్రియ నిమిత్తం ఈఎన్​సీ కార్యాలయానికి పంపించి ప్రాజెక్టుల పనులు త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో ​ఘన వ్యర్థాల నిర్వహణ  సంబంధించి కన్సల్టెన్సీ రూపొందించిన డీపీఆర్ పై కూలంకషంగా సమీక్షించామని తెలిపారు. తుది నివేదికను జాప్యం చేయకుండా త్వరితగతిన సమర్పించాలని కన్సల్టెన్సీ ప్రతి నిధులకు  స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

​ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో నగరపాలక సంస్థ డీఈ దేవేంధర్, సంబంధిత ప్రాజెక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు