జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా...

23-10-2026 | 04:37pm

ఎస్.ఐ.ఆర్ ను రద్దు చేయాలని ప్రజా సంఘాల నిరసన...

ఆదిలాబాద్, అక్టోబర్ 23, (విజయక్రాంతి) : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)(Special Intensive Revision) ను వెంటనే రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ అని అన్నారు.

కానీ ప్రధాన ఎన్నికల కమిషనర్ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ దాసోహం అయిందని ఆరోపించారు. ఇది భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వెంటనే ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించడం రాజ్యాంగ హక్కుల్ని హరించడమే అవుతుందని అన్నారు.  కమిషనర్ ను తొలగించని పక్షంలో రానున్న రోజుల్లో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సాయన్న, ఐద్వా జిల్లా కార్యదర్శి మంజుల, తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు