వీపు నొప్పే కదా అని లైట్ తీసుకోకండి...

24-11-2026 | 04:16pm

ఈరోజుల్లో హార్ట్ అటాక్(Heart Attack) ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. అప్పటి దాకా ఆరోగ్యంగా(Health) ఉన్న మనిషి ఉన్నట్టుండి కుప్పకూలి గుండె ఆగిపోయి ప్రాణం పోతున్న రోజులివి. సాధారణంగా వీపు నొప్పి వస్తే కండరాల నొప్పి(Muscle pain) అని భావిస్తుంటాం. లేదా పడుకునే పద్ధతి సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిందని అనుకుంటాం.

కానీ.. చివరకు గుండెకు వెళ్లే ధమని పూర్తిగా బ్లాక్ అయి హార్ట్ ఎటాక్ వరకూ వెళ్తుంది. మహిళల్లో గుండెపోటు లక్షణాలు పురుషులతో పోల్చితే కొంచెం భిన్నంగా ఉంటాయి. గుండెపోటు అంటే కేవలం ఛాతీలో విపరీతమైన నొప్పి వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ మహిళల్లో లక్షణాలు భిన్నంగా ఉంటాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొంది.

మహిళలు గుండెపోటు సమయంలో కింద పేర్కొన్న లక్షణాలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు:

* వీపు, మెడ, దవడ, భుజాలు లేదా చేతుల్లో అసౌకర్యం.

* ఛాతీలో నొప్పి ఉన్నా లేకపోయినా ఊపిరి ఆడకపోవడం.

* విపరీతమైన లేదా అసాధారణమైన అలసట.

* వికారం, వాంతులు లేదా అజీర్ణం వంటి సమస్యలు.

* తల తిరగడం లేదా స్పృహ తప్పినట్లు అనిపించడం.

* చెమటలు పట్టి ఒళ్లంతా చల్లబడిపోవడం.

ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, శరీరంలో కనిపించే అసాధారణ మార్పులను, ముఖ్యంగా మహిళలు తమకు వచ్చే నొప్పులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

మరిన్ని వార్తలు