వృషభ రాశి..ఈ విషయంలో జాగ్రత్త!
29-09-2026 | 08:21am
వృషభ రాశి(Taurus)వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగుతుంది. అధికారుల నుంచి నమ్మకం, గుర్తింపు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందే అవకాశాలున్నాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఒకరిద్దరు బంధువులతో అనుకోకుండా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి కొంత ఒత్తిడి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం.