ఈ-స్కూటర్ ఉందా? కాస్త జాగ్రత్త!
29-09-2026 | 08:57am
ఛార్జింగ్ పెట్టిన 10 నిమిషాలకే.. పేలిన ఈ-స్కూటర్!
జగిత్యాల: జిల్లాలోని కోరుట్ల సాయిరాంపూర్ కాలనీలో ఎలక్ట్రిక్ స్కూటర్(Electric scooter) పేలిన ఘటన కలకలం రేపింది. ఇంటి ఆవరణలో స్కూటర్‌కు ఛార్జింగ్ పెట్టిన పది నిమిషాలకే భారీ శబ్దంతో వాహనం పేలిపోయింది. చూస్తుండగానే మంటలు వ్యాపించి స్కూటర్ పూర్తిగా దగ్ధమైంది.
అప్రమత్తమైన యజమాని వెంటనే మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. స్కూటర్ విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని సమాచారం. ఛార్జింగ్ సమయంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.