షటిల్ ఆడుతుండగా గుండెపోటు
తుంగతుర్తి(విజయ క్రాంతి):సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియోగ్రాఫర్(Radiographer)గా పనిచేస్తున్న వెలుగు కరుణాకర్ (60) సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ షటిల్ గ్రౌండ్లో సెటిలాడుతూ సాయంత్రం 7 గంటల 45 నిమిషాలకు ఒక్కసారిగా గుండెలో నొప్పి రావడంతో పడుకొని స్వేద తీస్తున్నాడు.. ఎంతసేపటికి లేవకపోవడంతో గమనించిన పక్క వారు, దగ్గరికి వచ్చి చూసేసరికి, నిషా స్థితిలో ఉన్నాడు. తక్షణమే సిపిఆర్ చేసిన, తోటి షటిల్ ప్లేయర్లు ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా అప్పటికే చనిపోయినట్లుగా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వెలుగు కరుణాకర్ వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులుగా పనిచేస్తున్నాడు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో పుట్టి, ప్రభుత్వ పాఠశాల విద్యను అభ్యసంచి, మంచి మార్కులతో, ప్రభుత్వ ఉద్యోగమును సంపాదించి, పలువురుతో కలుగొలుపుగా మాట్లాడుతూ సోమవారం ఉదయం ప్రభుత్వ దవాఖానాల్లో డ్యూటీ చేసి, తిరుగు బస్సు ప్రయాణంలో అందరితో నవ్విస్తూ, నవ్వుతూ.. రాత్రి విధి రాతలో, గుండెపోటుతో మృతి చెందడం బాధాకరం. దీనితో ఆయన మృతి పట్ల దవాఖాన సూపరిండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్ తో పాటు, ఆరోగ్య సిబ్బంది, స్థానిక జర్నలిస్టులు, వివిధ పార్టీ నాయకులు, గ్రామస్తులు, తమ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు.