సిల్వర్ మెడల్‌తో స్వదేశానికి
29-09-2026 | 09:03am
న్యూఢిల్లీ: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ సైఖోమ్ మీరాబాయి చాను(Saikhom Mirabai Chanu) ఢిల్లీకి చేరుకున్నారు. జపాన్‌లో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో మహిళల 49 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన ఆమె.. ఇవాళ ఉదయం తన కోచ్ విజయ్ శర్మతో కలిసి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. చారిత్రాత్మక ప్రదర్శనతో దేశానికి పతకం అందించిన మీరాబాయి చానుకు అభిమానులు స్వాగతం పలికారు.