మిథున రాశి వారికి గుడ్‌న్యూస్
29-09-2026 | 10:29am
మిథున రాశి(Gemini)వారికి వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం, సహకారం లభిస్తాయి. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారాల్లో రాబడి గణనీయంగా పెరుగుతుంది. సోదరులతో కొనసాగుతున్న ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది.ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన రావచ్చు. ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.