ఆరోగ్య మంత్రం

20-09-2026 | 05:05am

పఠించే ప్రతి మంత్రం వెనుక బలమైన శక్తి ఉంది. ఆయుష్షును పెంచే తత్వమూ ఉంది. సైన్స్ కూడా దీన్ని రుజువుచేసింది. ఆధునిక సైన్స్(Modern Science) కేవలం మంత్రం మీదే కాకుండా.. ఆ మంత్రం పలికేటప్పుడు గొంతులో, నాభిలో పుట్టే పౌనఃపున్యం, శ్వాస 

లయ మీద దశాబ్దాలుగా ప్రయోగాలు(Experiments) చేసి అద్భుతమైన నిజాలను వెలికితీసింది. గాయత్రీ మంత్రం(Gayatri Mantra) రుగ్వేదం(3వ మండలం)లోని అత్యంత శక్తిమంతమైన మంత్రం. ఢిల్లీ(Delhi)లోని ఎయిమ్స్, ఐఐటీ శాస్త్రవేత్తలు(AIIMS and IIT scientists) సంయుక్తంగా మ్యాగ్నెటోఎన్సెఫ(Magneto encephalon)లోగ్రఫీ స్కాన్ల ద్వారా భారీ ప్రయోగాలు చేశారు. ఈ మంత్రంలోని నిర్దిష్టమైన అక్షరాల (తత్ సవితుర్వరేణ్యం..) కలయికను పలికేటప్పుడు మెదడులోని ‘ప్రీఫ్రంటల్ కార్టెక్స్’ విపరీతంగా ఉత్తేజితం అవుతుందని తేలింది. ఈ మంత్ర ఉచ్చారణ వల్ల మెదడులో ‘గ్రే మ్యాటర్’ పెరుగుతుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు రాకుండా గాయత్రీ మంత్రం అడ్డుకుంటుంది. మెదడు కణాలు త్వరగా క్షీణించకుండా కాపాడటం ద్వారా మనిషి మానసిక ఆయుష్షును పదిలపరుస్తుంది.

సమస్త మానవాళి కోసం

‘గాయంతం త్రాయతే ఇతి గాయత్రీ’ అంటే.. ఎవరు దీనిని పఠిస్తారో, వారు అజ్ఞానం, భయం, జీవిత సమస్యల నుంచి రక్షణ పొందుతారు. గాయత్రీ మంత్రంలోని ప్రతి పదం వెనుక నిగూడ అర్థం దాగి ఉంది. ఓం: ప్రణవ నాదం, పరమాత్మ స్వరూపం; భూర్: భూలోకం (అస్తిత్వానికి ఆధారం); భువః: భువర్లోకం (అంతరిక్షం, ప్రాణశక్తి), స్వః: సువర్లోకం (స్వర్గం, ఆనందమయ స్థితి); తత్: ఆ (నిర్గుణ పరబ్రహ్మను సూచించేది); సవితుర్: సకల సృష్టికి మూలమైన ఆ ప్రేరణ శక్తికి (ప్రేరకుడు); వరేణ్యం: కోరుకోదగిన అత్యున్నతమైన, లేదా వరించదగిన ఆరాధించదగిన; భర్గః: పాపాలను, అజ్ఞానాన్ని దహించే దైవిక తేజస్సు; దేవస్య: ప్రకాశించే స్వభావం గల దైవం; ధీమహి: మేము ధ్యానిస్తున్నాము; ధియో: బుద్ధులను; యో: ఏ (తేజశ్శక్తి/పరమాత్మ) అయితే; నః: మమ్మల్ని; ప్రచోదయాత్: ప్రేరేపించుగాక (సన్మార్గంలో నడిపించుగాక). 

చాలా ప్రార్థనలూ, మంత్రాలూ వ్యక్తిగత కోరికల కోసం ఉంటాయి. కానీ గాయత్రి మంత్రంలో ‘నః’ (మా) అని ఉంటుంది. అంటే, ఇది లోకంలోని సమస్త మానవాళికి కావలసిన జ్ఞానం, వివేకం కోసం చేసే సార్వత్రిక ప్రార్థన.

మంత్రాలను పఠిస్తే..!

మన శరీరంలోని 10వ క్రానియల్ నెర్వ్ అయిన ‘వేగస్ నెర్వ్’ మెదడు నుంచి మొదలై, గొంతు, గుండె, జీర్ణవ్యవస్థల గుండా ప్రయాణిస్తుంది. మంత్రం పఠించేటప్పుడు మనం దీర్ఘశ్వాస తీసుకుని, శబ్దాన్ని ఉచ్చరిస్తూ నెమ్మదిగా గాలి వదులుతాం. వేగస్ నెర్వ్ గాలి వదిలే సమయంలో గొంతులో వచ్చే ప్రకంపనల వల్ల యాక్టివేట్ అవుతుంది. అప్పుడు విడుదలయ్యే ద్రవం ఎసిటైల్ కొలిన్. ఈ రసాయనం గుండె రక్తనాళాలను విశాలం చేసి, హృదయ స్పందనను నెమ్మదించేలా చేస్తుంది. శరీరంలో ఒత్తిడి ఆగిపోయి, ‘రెస్ట్ అండ్ డైజెస్ట్’ అనే ప్రశాంతమైన వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది.

18 నిమిషాల్లో 108 సార్లు

ప్రాచీనులు సూచించిన క్రమబద్ధమైన శ్వాస ప్రకారం.. ఒక మనిషి నిమిషానికి 5.5 నుంచి 6 సార్లు శ్వాస తీసుకోవాలి. ఒకసారి గాయత్రీ మంత్రం పఠించడానికి (దీర్ఘంగా గాలి పీల్చి, మంత్రం ఉచ్చరిస్తూ గాలి వదలడానికి) సుమారు 10 సెకన్ల సమయం పడుతుంది. అంటే.. నిమిషానికి సరిగ్గా 6 సార్లు. 108 సార్లు పూర్తి చేయడానికి 18 నిమిషాలు పడుతుంది. (సగటున 5.5 శ్వాసల చొప్పున పఠిస్తే సుమారు 20 నిమిషాలు పడుతుంది).

కణాలు ముసలిబారవు

‘త్య్రంబకం యజామహే..’ అంటూ సాగే మహామృత్యుంజయ మంత్రం రుగ్వేదం (7వ మండలం)లో ఉంది. ఇది ప్రాణరక్షణకు ప్రసిద్ధి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ (యూఎస్‌ఏ), ఎన్‌ఐఎంహెచ్‌ఎన్‌ఎస్ (ఇండియా) అధ్యయనాల ప్రకారం.. ఈ మంత్రంలోని మహాప్రాణ అక్షరాల కూర్పు దేహంలో ‘లో-ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్’ సృష్టిస్తుంది. ఈ వైబ్రేషన్స్ శరీరంలో దీర్ఘకాలిక వాపును తగ్గించి, ప్రమాదకరమైన ‘సైటోకిన్’ స్థాయిలను నియంత్రిస్తాయి. ముఖ్యంగా కణాల లోపల ఉండే ‘టెలోమెరేస్’ అనే ఆయుష్షు ఎంజైమ్‌ను చురుగ్గా మారుస్తాయి. దీనివల్ల కణాలు ముసలిబారిపోవడం నెమ్మదిస్తుంది.

గుండె లయ.. ఓంకారం

వేద మంత్రాలకు మూలం ఓంకారమే. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధన ప్రకారం.. ‘ఓం’ అని దీర్ఘంగా పలికినప్పుడు వచ్చే అనునాదం కచ్చితంగా 0.1 హెచ్‌జెడ్ పౌనఃపున్యానికి వస్తుంది (ఇది భూమి సహజ పౌనఃపున్యం). దీనివల్ల ‘హార్ట్ రేట్ వేరియబిలిటీ’ పెరుగుతుంది. ఎవరికైతే గుండె లయ ఎక్కువగా ఉంటుందో, వారు వందేళ్లు దాటి జీవిస్తారని మెడికల్ సైన్స్ ఘంటాపథంగా చెబుతున్నది. ‘ఓం’ కారం పలకడం వల్ల మన గుండెకు బలం చేకూరుతుంది. ఆయుష్షూ పెరుగుతుంది.  

రోజూ 15 నిమిషాలు పలికినా..!

మంత్రం అనేది ఒక బయోలాజికల్ టూల్. దానికీ కులానికి, మతానికి సంబంధం లేదు. ఎవరైనా చదవచ్చు. స్త్రీ, పురుషులు, పిల్లలు, పెద్దలు ఎవరైనా ఉచ్చారణ దోషం లేకుండా స్పష్టంగా పలకగలిగే ప్రతి ఒక్కరూ చదవవచ్చు. ఇంట్లో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే చోట లేదా ఆరుబయట చదవాలి. ఎందుకంటే, మహాప్రాణాలు పలికేటప్పుడు ఊపిరితిత్తులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అవసరం కాబట్టి! రోజంతా జపమాలలు పట్టుకుని కూర్చోవాల్సిన పనిలేదు. ఉదయం ప్రశాంతమైన వాతావరణంలో కేవలం 10- నుంచి 15 నిమిషాలు లయబద్ధంగా పఠిస్తే చాలు. ఇది డాక్టర్ హెర్బర్ట్ బెన్సన్ చెప్పిన ‘రిలాక్సేషన్ రెస్పాన్స్’ను యాక్టివేట్ చేసి, రోజంతా కణాలను సేఫ్ మోడ్‌లో ఉంచుతుంది.

పరిశోధనల్లో తేలింది ఇదే..!

* వేద మంత్రాల లయబద్ధమైన పఠనం శరీరంలో ఒక ’బయో-ఎకౌస్టిక్ రెజోనెన్స్’ (జీవ-ధ్వని అనునాదం) సృష్టిస్తుందని నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్  నిరూపించింది. ఈ ప్రక్రియ వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గి, కణాలలో ‘టెలోమెరేస్’ అనే ఎంజైమ్ చురుగ్గా మారుతుంది. సైన్స్ ప్రకారం.. ఈ ఎంజైమ్ నేరుగా మనిషి కణాల ఆయుష్షును పెంచడానికి, జన్యువుల మరమ్మతుకు కారణమవుతుంది.

* ఎయిమ్స్, ఐఐటీ ఢిల్లీ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనల్లో గాయత్రీ మంత్రం పఠించడం వల్ల మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అత్యంత చురుగ్గా మారినట్లు తేలింది. ఈ నాడీ ఉత్తేజం వల్ల.. వయసు పైబడే కొద్దీ వచ్చే ‘మతిమరుపు’ వంటి మెదడు సంబంధిత వ్యాధులకు అడ్డుకట్టపడుతుంది.  

* ఇటలీ పరిశోధకుడు డాక్టర్ లూసియానో బెర్నార్డి నిర్వహించిన అధ్యయనంలో.. వయోజనులు లయబద్ధంగా మంత్రాలను పఠిస్తున్నప్పుడు వారి శ్వాస రేటు సహజంగానే నిమిషానికి కచ్చితంగా 6 శ్వాసలకు పడిపోయిందని నిరూపితమైంది. ఈ కచ్చితమైన ఫ్రీక్వెన్సీ నేరుగా వేగస్ నెర్వ్‌ను ప్రేరేపించి.. శారీరక ప్రశాంతతను, గుండెకు ఆరోగ్యాన్ని అందిస్తుందని తేలింది.   

టి.అనిల్ కుమార్  

హనుమకొండ (9989225258) 

మరిన్ని వార్తలు