ఇవాళ గణపతికి ఏ నైవేద్యం పెట్టాలో తెలుసా..?

15-09-2026 | 11:17am

హైదరాబాద్, సెప్టెంబర్​ 15(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా భక్తులు మండపాలను ఏర్పాటు చేసి వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. భాద్రపద శుద్ధ చవితి నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో గణనాథుడికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంత చతుర్దశి రోజున వినాయకుడి నిమజ్జనంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 25న అనంత చతుర్దశి రానుంది. అయితే ఈ తొమ్మిది రోజులు వినాయకుడి నేవేద్యం సమర్పిస్తుంటారు.. ఇవాళ రెండో రోజు గణపయ్యకు ఏం నైవేద్యం పెట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందా..

సెప్టెంబర్​ 15 ..(భాద్రపద శుద్ధ పంచమి).. వికట వినాయకుడిని పూజించాలి.  లంబోదరశ్చ వికటో’ అని వినాయకుడి షోడశ నామాలను స్మరించాలి.  స్వామిని వికట వినాయకునిగా ఆవాహన చేసి పూజలు చేసి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి.

మరిన్ని వార్తలు