సోనాల కాంగ్రెస్‎లో కల్లోలం..! సర్పంచుల రాజీనామా బాట

15-09-2026 | 12:03pm

బోథ్ సెప్టెంబర్ 14 ( విజయ క్రాంతి): సోనాల కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో కల్లోలం చెలరేగుతున్నది. దీంతో అదే పార్టీకి చెందిన సర్పంచులు పార్టీకి రాజీనామా చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. విషయం తెలిసిన బోత్ బ్లాక్ ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ సర్పంచ్లను సముదాయించి పార్టీకి దూరం కావద్దని రాజీనామాలు చేయకుండా అడ్డుపడ్డట్లు తెలిసింది. రాకరాక వచ్చిన అవకాశాన్ని నాయకులు జారవిడుచుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పార్టీ మండల కన్వీనర్ గాజుల పోతన్న మాత్రం ఇలాంటి సంఘటనలు మామూలేనని పార్టీ అంతర్గత విభేదాలను సరి చేసుకుంటామంటున్నారు. 

రాజీనామా ప్రస్తావన ఎందుకు

అధికార పార్టీ సర్పంచులు రాజీనామా చేసేందుకు ఎందుకు వస్తున్నారని మండలంలో చర్చ కొనసాగుతుంది. గ్రూపు విభేదాలకు తోడు మండల కన్వీనర్ తో సఖ్యత కుదరక రాజీనామా కు సిద్ధ పడ్డట్లు తెలుస్తుంది. మండల కన్వీనర్ ఇందిరమ్మ కమిటీ జాబితా అడిగితే ఈ విషయంలో సర్పంచుల సంఘం అధ్యక్షునికి వినోద్ మండల కన్వీనర్ మధ్య మాట పెరిగి రాజీనామా వరకు వచ్చిందని అంటున్నారు. తనను కన్వీనర్ కావాలని వేధిస్తున్నారంటూ సర్పంచ్ ఆరభించారు. కాగా ఈ విషయమై కన్వీనర్ను వివరణ కోరగా అధిష్టానం ఆదేశాల మేరకు తాను గ్రామస్థాయిలో ఉండే కమిటీ జాబితాను అడగడం తప్పుగా భావిస్తున్నారన్నారు. 

బిఆర్‎ఎస్‎కు మరింతబలం చేకూర్చినట్లు అవుతుంది

స్థానికంగా ఎమ్మెల్యే విఆర్ఎస్ పార్టీకి చెందిన వాడు కావడంతో ఆయన పాలన యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకోవడం సర్వసాధారణం. అయితే అధికారులు తమ మాట పెడచెవిన  పెడుతున్నారంటూ రాబోతున్నారు. కనీసం నియోజకవర్గం జిల్లా స్థాయి పార్టీ అధినాయకులైన అధికారుల తీరుపై పరిశీలించాలని అంటున్నారు. అధికారంలో ఉన్న లేకున్నా ఒకే రీతిలో ఉందని కొంతమంది సర్పంచులు వాపోతున్నారు. అసమ్మతిని గ్రూపు విభేదాలను అరికట్టకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే ఆస్కారం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు