మేడ్చల్ జిల్లా కోర్టు భవనానికి శంకుస్థాపన

13-09-2026 | 02:22pm

హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్రెష్ కుమార్ సింగ్ హాజరు

మేడ్చల్ అర్బన్ సెప్టెంబర్ 13(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్(Medchal District Court building) సర్కిల్ గుండ్లపోచంపల్లి మున్సిపల్ పట్టణ పరిధిలోని కండ్లకోయ రెవెన్యూ పరిధిలో మేడ్చల్ జిల్లా కోర్టు భవనానికి శంకుస్థాపన చేశారు. ఆదివారం ఉదయం కండ్లకోయ మున్సిపల్ పట్టణ పరిధిలో జిల్లా కోర్టు భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్(High Court Chief Justice) ఆఫ్రెష్ కుమార్ సింగ్ పాల్గొని కొబ్బరి కాయ కొట్టి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు జడ్జిలు కే లక్ష్మణ్, విజయసేన్ రెడ్డి, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ, జిల్లా కలెక్టర్ మను చౌదరి.మేడ్చల్ జిల్లా జడ్జి వి.బాల భాస్కర్ రావు, మేడ్చల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చీదు హనుమంత రెడ్డిలు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు