ఏళ్ల నాటి విద్యుత్ సమస్యకు పరిష్కారం
శ్రీరంగాపూర్: వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ నుంచి ఆది బసవేశ్వర స్వామి ఆలయం(Adi Basaveswara Swamy Temple) వరకు నూతన విద్యుత్ లైన్ మంజూరు కావడంతో గ్రామ సర్పంచ్ మద్దిలేటి(Srirangapur Sarpanch Maddileti) శనివారం పనులను ప్రారంభించారు. సుదీర్ఘకాలంగా విద్యుత్ లైన్ సౌకర్యం లేక ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేశారు.
నూతన విద్యుత్ లైన్ పనులు ప్రారంభం కావడంతో ఆలయానికి వచ్చే భక్తులతో పాటు స్థానిక ప్రజలకు విద్యుత్ సౌకర్యం మెరుగుపడనుంది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న సమస్య పరిష్కార దిశగా అడుగులు పడటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదటి వార్డు సభ్యురాలు పుష్పలత, నాలుగో వార్డు సభ్యుడు ఆంజనేయులు, కాంట్రాక్టర్ క్రాంతి, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.