గాంధారి మండల సమాఖ్యకు జిల్లా స్థాయి అవార్డు

17-10-2026 | 10:02pm

గాంధారి,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం(Kamareddy District Collector Office)లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో గాంధారి మండల సమాఖ్యకు జిల్లా స్థాయి అవార్డు లభించింది. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మండల సమాఖ్య అధ్యక్షురాలు అంబాలక్ష్మి అందుకున్నారు. ఈ సందర్భంగా మండల సమాఖ్య సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గాంధారి మండల సమాఖ్యకు జిల్లా స్థాయి అవార్డు లభించడం మండలానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రసన్నకుమార్, సీసీ సౌజన్య, అకౌంటెంట్ సుధాకర్, వీఓఏ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు