పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి

04-10-2026 | 05:19pm

శ్రీరంగాపూర్, అక్టోబర్ 4: 2023 నవంబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ కోరారు. శ్రీరంగాపూర్ మండల(Srirangapur Mandal) కేంద్రంలో నిర్వహించిన పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమంలో(Graduate Voter Registration Program) ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి గడువులోగా నమోదు చేసుకోవాలని సూచించారు. వనపర్తి జిల్లాలో 100 శాతం పట్టభద్రుల ఓటు నమోదే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్, వెంకటస్వామి, షఫీ, సయ్యద్, శ్రీనివాస గౌడ్, కృష్ణయ్య, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు