కార్తీక శుద్ధ త్రయోదశి ఆదివారం భక్తి శ్రద్ధలతోగోదావరి హారతి

22-11-2026 | 10:49pm

భద్రాద్రి పురోహితుల సంఘం అధ్యక్షులు రామవజ్జల రవికుమార్

భద్రాచలం ( విజయక్రాంతి): గత జిల్లా కలెక్టర్ చొరవతో భద్రాద్రి(Bhadradri) దివ్య క్షేత్రంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న గోదావరి హారతి(Godavari Harati) భక్తుల(devotees) ఆదరణతో అంగరంగ వైభవంగా జరుగుతున్నదని అర్ధరాత్రి పురోహితుల సంఘం అధ్యక్షులు రామవజ్జల రవికుమార్ అన్నారు. ఆదివారం గోదావరి స్నాన ఘట్టాల వద్ద నిర్వహించిన గోదావరి హారతిలోముందుగా గణపతి పూజ శ్రీ సీతారామచంద్రస్వామి వారి కి గోదావరి మాతకు అష్టోత్తర శతనామాచనలు నిర్వహించి అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి(Sri Sitaramachandra Swamy) వారికి, గోదావరి మాతకు దివ్య హారతులు సమర్పించడం జరిగిందని ఆయన అన్నారు.

లోక కళ్యాణార్ధం, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని, గోదావరి మాతను ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. గోదావరి మాతకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి హారతులు సమర్పించిన పురోహితులు రాయప్రోలు సత్యప్రసాద్ శర్మ, బుక్కపట్నం, రామాచార్యులు, చంద్రశేఖర శర్మ, తేజ శర్మ, శివ,విహెచ్పి తిరుపతిరావు,  సత్యనారాయణ రెడ్డి  సమర్పించగా, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  అనంతరం రవికుమార్ లక్ష్మీదంపతులు, రామాచార్యులు, పిఎస్ఎన్ రెడ్డి దంపతులు సమర్పించిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేసి శాంతి మంత్ర పఠనంతో గోదావరి హారతి కార్యక్రమం ముగించడం జరిగిందని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు