మహా పడిపూజ మహోత్సవానికి స్వాముల ఆహ్వానం

22-11-2026 | 10:26pm

నాగిరెడ్డిపేట్,నవంబర్ 22 (విజయక్రాంతి): మండలంలోని గోపాల్పేట్ గ్రామంలో(Gopalpet Village) అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 4వ తేదీన అయ్యప్ప స్వామి వారి సామాజిక మహా పడిపూజ మహోత్సవం కార్యక్రమానికి రావాలని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao), మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మరియు వివిధ ప్రజాప్రతినిధులకు నాగిరెడ్డిపేట్ మండల(Nagireddypet Mandal) అయ్యప్ప స్వాములు కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపాల్పేట గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్,అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు