బైక్ దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్
చోరీకి గురైన బజాజ్ పల్సర్ బైక్ స్వాధీనం
సిద్దిపేట క్రైం, నవంబర్ 22 : సిద్దిపేట పట్టణంలో(Siddipet town) ద్విచక్ర వాహనం దొంగతనానికి పాల్పడిన నిందితుడిని టూటౌన్ పోలీసులు(Two-Town Police) అరెస్ట్ చేశారు. చోరీకి గురైన బజాజ్ పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ మురళి వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న సిద్దిపేటలోని(Siddipet) బీఎంఆర్ కళాశాల(BMR College) పక్కన మోతె అనిల్ అనే వ్యక్తి తన బజాజ్ పల్సర్ బైక్ను పార్కింగ్ చేసి భోజనానికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లు ఫిర్యాదు చేయగా సిద్దిపేట టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో ఆదివారం నర్సాపూర్ చౌరస్తా వద్ద మెదక్ జిల్లా చేగుంట మండలం బి.కొండాపూర్ గ్రామానికి చెందిన వరదం యాదగిరి అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన బజాజ్ పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో చేగుంట, మెదక్, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు మోటార్ సైకిళ్ల దొంగతనాలతో పాటు ఇతర చోరీ కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.