ఘనంగా ఆదివాసీ గిరిజన సంఘం 2వ జిల్లా మహాసభలు

22-11-2026 | 10:29pm

చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) చెన్నూర్ పట్టణంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(Telangana Adivasi Girijana Sangham) 2వ జిల్లా మహాసభలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని బస్టాండ్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిర్ అంబేద్కర్(Dr. BR Ambedkar)  విగ్రహానికి సంఘ నాయకులతో కలిసి పూలమాల  వేసి నివాళులు అర్పించారు.  జిల్లా అధ్యక్షులు భాగాల రాజన్న జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం కార్యక్రమం ప్రారంభించారు.

సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. ఆదివాసీ పేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పన కై ఉద్యమిద్దామన్నారు. పొడుభూముల హుక్కు పత్రాలు సాధనకై, దస్లీ రైతుల(Farmers) సమస్యలపై  గ్రామాల్లో ఇండ్లు, రోడ్లు, కరెంటు,కనీస సౌకర్యాల కల్పన కై అలుపెరుగని పోరాటలు ఆదివాసీ పేదలు సిద్ధంగా ఉండాలన్నారు.

మరిన్ని వార్తలు