మాతా శిశు మరణాల నివారణకు అవగాహన ర్యాలీ

22-11-2026 | 10:34pm

సురక్షిత ప్రసవాలపై 300 మంది నర్సింగ్ విద్యార్థుల ప్రచారం

మంచిర్యాల క్రైమ్, నవంబర్ 22(విజయక్రాంతి): మాతా శిశు మరణాలను(Maternal and infant mortality) తగ్గించి, సురక్షిత ప్రసవాలను(Safe Childbirths) ప్రోత్సహించడమే లక్ష్యంగా సొసైటీ ఆఫ్ మిడ్‌వైవ్స్ ఇండియా(Society of Midwives India) ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాలలో(Mancherial) అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు సాగిన ర్యాలీలో ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కళాశాలలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు(Students) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్(District Medical and Health Officer Dr. Narender Rathod) మాట్లాడుతూ... ప్రసూతి సేవల్లో మిడ్‌వైఫ్‌లు, నర్సింగ్ సిబ్బంది పాత్ర కీలకమన్నారు. వైద్యులు, నర్సింగ్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ మాతా శిశు మరణాల నివారణకు కృషి చేయాలని సూచించారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు(Medical examinations), అవసరమైన చికిత్సలు, మందుల వినియోగం, జీవనశైలి మార్పులపై గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడం, ప్రసవ సమయంలో ఎదురయ్యే సమస్యలను ముందుగానే గుర్తించి తగిన వైద్యం అందించడం ద్వారా మాతా శిశు మరణాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.

సొసైటీ ఆఫ్ మిడ్‌వైవ్స్ ఇండియా 1998లో హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమై, 2000 నవంబరు 22న అధికారికంగా ఆవిర్భవించింది. దేశవ్యాప్తంగా మిడ్‌వైఫరీ సేవలకు గుర్తింపు తీసుకురావడంతోపాటు నాణ్యమైన, గౌరవప్రదమైన ప్రసూతి సేవలను అందించేందుకు కృషి చేస్తోంది. తెలంగాణలో అనవసర సిజేరియన్లను తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మిడ్‌వైఫ్‌ల నైపుణ్యాలను పెంపొందించడం, ఆధునిక పరిశోధనలను ప్రోత్సహించడం సంస్థ ప్రధాన లక్ష్యాలుగా కొనసాగుతున్నాయి.

ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఫాతిమా జూలియట్, సుజాత, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సంచాలకుడు డాక్టర్ శ్రీధర్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, ప్రిన్సిపల్ ప్రేమ్ కుమార్, అల్లాడి శ్రీనివాస్, నాందేవ్, కిష్టన్న, ఎస్‌ఆర్‌కేఎం, ప్రభ తదితర నర్సింగ్ కళాశాలల విద్యార్థినులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు