ఇందిరమ్మ బీమాతో పేద కుటుంబాలకు భరోసా
22-11-2026 | 10:24pm
శివంపేట, నవంబర్ 22 ( విజయక్రాంతి ): శివంపేట మండల(Shivampet Mandal) కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని(Indiramma Family Life Insurance Scheme) గ్రామ సర్పంచ్ రాజిపేట వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రేషన్ కార్డులు(Ration Cards) కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులని, అర్హులైన వారందరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇసుగారి మల్లేష్, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.