తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి

10-09-2026 | 12:51am

ఈ నెల 11న వారోత్సవాల ప్రారంభం

భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపు

సూర్యాపేట రూరల్,(విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట(Telangana Peasant Armed Struggle) త్యాగాలను నేటి తరానికి తెలియజేస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు(CPI Urban Secretary Boora Venkateshwarlu) పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని భవనంలో జరిగిన పట్టణ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూస్వామ్య నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటం చరిత్రలో చెరగని ముద్ర వేసిందని పేర్కొన్నారు.

భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల 11న ధర్మ బిక్షం విగ్రహం వద్ద సాయుధ పోరాట వారోత్సవాల ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు చేరవేయాలని కోరారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి రైతులు, కార్మికులు, కూలీలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై వారోత్సవాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. బొమ్మగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చామల అశోక్ కుమార్, రేగటి లింగయ్య, దీకొండ శ్రీనివాస్, పెండ్ర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు