అయ్యప్ప ఆలయంలో భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు

10-09-2026 | 12:31am

పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయం(ayyappa temple)లో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని బుధవారం సామూహిక సత్యనారాయణ వ్రతాల(Satyanarayana rituals) పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, వ్రత కథా పారాయణం నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అర్షపల్లి సాయి రెడ్డి, అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు