ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి

10-09-2026 | 12:35am

మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

ఎక్కువ శబ్దం వచ్చి డీజేలకు అనుమతి లేదు: ఎస్పి అఖిల్ మహాజన్

బోథ్,(విజయక్రాంతి): గణేష్ పండగ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan) పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో బజారత్నూర్ సోనాల బోత్ నేరడిగొండ మండలాల గణేష్ ఉత్సవ కమిటీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వినాయక చవితి నవరాత్రులు(Vinayaka Chavithi Navratri) అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు. మండపాల నిర్వహణ జాగ్రత్తగా జరుపుకోవాలని అంతేగాక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సోషల్ మీడియా(Social media)లో వచ్చే వదంతులు నమ్మవద్దన్నారు.

నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. పోలీసులు సైతం నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు సహకరిస్తారన్నారు. అవసరమైన మేరకు బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు. కలిసిమెలిసి ప్రజలంతా ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. గణపతి మండపాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దీని ద్వారా నవరాత్రి ఉత్సవాల్లో చేయవలసిన బందోబస్తు కేటాయించవలసి వస్తుందన్నారు. గతంలో ఏర్పాటు చేసిన గణపతి మండపాలకు మాత్రమే అనుమతి ఉందని కొత్తగా ఏర్పాటు చేసి మండపాలకు అనుమతులు లేవన్నారు. సమావేశంలో ఆయా మండలాల గణేష్ మండపాల నిర్వాహకులతో పాటు ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి సిఐడి గురుస్వామి,సిహెచ్ రమేష్ ఎస్సైలు పురుషోత్తం రమేష్ హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు