పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

27-10-2026 | 07:08pm

ఎస్ఐ చలికంటి నరేష్

హుజూర్ నగర్, అక్టోబర్ 27: పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి అని హుజూర్ నగర్ ఎస్ఐ చలికంటి నరేష్(Huzurnagar SI Chalikanti Naresh) అన్నారు.  పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను సందర్బంగా మంగళవారం పట్టణంలోని మెయిన్ రోడ్డులో బైక్ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు...ప్రజల రక్షణ కోసం సమాజంలో శాంతి భద్రతల కోసం నిరంతరం పాటుపడేది పోలీసులేనని అన్నారు.పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల భద్రతకై నిరంతరం పాటుపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ-2 హనుమా నాయక్,పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు