యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థి ప్రతిభ

24-09-2026 | 08:27pm

నేరేడుచర్ల, సెప్టెంబర్ 24(విజయ క్రాంతి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Government of Telangana State) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువ టూరిజం క్లబ్ (వైటీసీ )(Youth Tourism Club) కార్యక్రమంలో భాగంగా యువతలో పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలపై అవగాహన పెంపొందించడంతో పాటు వారి సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల, నేరేడుచర్లకు చెందిన గొడుగు మనీదీప్, హెచ్.ఈ.సి ప్రథమ సంవత్సరం విద్యార్థి, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని పొనుగోడు గ్రామంలో ఉన్న స్వయంభూ త్రిలింగేశ్వర స్వామి ఆలయాన్ని తన డ్రాయింగ్‌లో అద్భుతంగా చిత్రీకరించి ప్రతిభను చాటుకున్నాడు.

కాకతీయుల కాలం నాటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయాన్ని వేసర శైలి (Vesara Style) నిర్మాణకళ ఆధారంగా విద్యార్థి తన చిత్రంలో ఆవిష్కరించాడు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి పి. నీరజ మేడమ్ ఆదేశాల మేరకు,డా.సైదులు మరియు వనపర్తి శ్రీనివాసులు విద్యార్థిని ప్రోత్సహించి, ఆలయాన్ని సందర్శించి దాని చారిత్రక, నిర్మాణ విశేషాలను పరిశీలించిన అనంతరం విద్యార్థి చేత డ్రాయింగ్ చేయించారు.చారిత్రక ఆలయాలు, వారసత్వ కట్టడాల ప్రాధాన్యతను విద్యార్థులకు పరిచయం చేయడం ద్వారా వారిలో పర్యాటక రంగంపై ఆసక్తిని పెంపొందించవచ్చని కళాశాల సిబ్బంది తెలిపారు. విద్యార్థి మనీదీప్ చూపిన సృజనాత్మక ప్రతిభను ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.

మరిన్ని వార్తలు