మూడుచింతలపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శామీర్ పేట్, సెప్టెంబర్ 24 ( విజయ క్రాంతి ): మూడుచింతలపల్లి మున్సిపాలిటీ(Muduchintalapalli Municipality) పరిధిలో పలువార్డులో అభివృద్ధి పనులకు గురువారం మున్సిపాలిటీ చైర్మన్ జాము రవి శంకుస్థాపన చేశారు. 8వ వార్డులో రూ.2.50 లక్షల నిధులతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు అదేవిదంగా 3వ వార్డులో రూ.2.50 లక్షల నిధులతో మంచినీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ.... ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చైర్మన్ తెలిపారు.
డ్రైనేజీ, తాగునీరు తదితర వసతులను దశలవారీగా మెరుగుపరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకట గోపాల్, డీఈ స్పూర్తి, పలువురు కౌన్సిలర్లు దోసకాయల లతా వెంకటేష్, పెద్దిరెడ్డి శ్రీలత వెంకటరెడ్డి, రాజీగల్ల లతా భూపాల్, శ్రీవాణి వైద్యనాథ్, సరిత శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, మాజీ ఎంపిటిసి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.