బోధన్ పట్టణంలో మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం

24-09-2026 | 09:50pm

బోధన్, సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి): మిషన్ భగీరథ(Mission Bhagiratha) నీటి సరఫరాలో సాంకేతిక కారణాల వల్ల అంతరాయం ఏర్పడనున్న నేపథ్యంలో బోధన్ పట్టణంలోని పలు ప్రాంతాలకు సెప్టెంబర్ 25న తాగునీటి సరఫరా నిలిచిపోనుందని మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్(Municipal Commissioner Krishna Jadhav) తెలిపారు. శక్కర్‌నగర్ పరిధిలోని వార్డు నంబర్లు 2, 3, 4, 19, 20, 21, 22, 23, 24, హౌసింగ్ బోర్డు పరిధిలోని వార్డు నంబర్లు 1, 2, 19, అలాగే గంజ్ ఏరియాలోని వార్డు నంబర్లు 13, 14, 28లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముందస్తుగా అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని కమిషనర్ సూచించారు. నీటి సరఫరాలో ఏర్పడే అంతరాయానికి పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు