ఆర్నాభ్ తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులను వెంటనే ఆదుకోవాలి

24-09-2026 | 09:54pm
  1. తుఫాన్ వల్ల దెబ్బతిన్న ఇండ్ల బాధితులకు వెంటనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
  2. సిపిఐ నేతల డిమాండ్

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. దంతేలబోర ఎస్సీ కాలనీలో బుధవారం సాయంత్రం ఆర్నాభ్ తుఫాన్ వల్ల 20 మందికి పైగా పేదల ఇండ్లు, రేకుల షెడ్లు కూలిపోయి.,నిత్యవసర సరుకులతో సహా పాడైపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులను గురువారం ఉదయం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు(Kothagudem MLA Koonamneni Sambasiva Rao) ఆదేశాల మేరకు ఎంపీడీవో రాజారావు ,రెవిన్యూ, విద్యుత్, వైద్య తదితర శాఖల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించారు.

ఈ సందర్భంగా  సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి  పూర్ణచంద్రరావు జిల్లా సమితి సభ్యుడు నిమ్మల రాంబాబు లు మాట్లాడుతూ.... ఆర్నాబ్ తుఫాను వల్ల నష్టపోయిన కుటుంబాలకు నిత్య అవసరాల నిమిత్తం వెంటనే ఒక్కో కుటుంబానికి 50 వేల రూపాయల చొప్పున.ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్న కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలన్నారు. ఇండ్లు దెబ్బతిన్న బాధితులందరికీ వెంటనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించి, త్వరితగతిన నిర్మించి ఇవ్వాలని. అలాగే కూరగాయల సాగు చేసుకుని జీవిస్తున్నటువంటి పేద రైతు కారుమంచి వెంకటేశ్వర్లు 20 గుంటల స్థలంలో వేసిన బెండ, వంగ, కాకర తదితర కూరగాయల తోట.

తుఫాను వల్ల పెద్ద పెద్ద  చెట్లు విరిగిపడి, ధ్వంసం అయ్యి తీవ్ర నష్టం కలిగిందని కూరగాయలు పండించుకుని జీవిస్తున్న పేద రైతు వెంకటేశ్వర్లకు రూ 1. 50, లక్షల  ఆర్థిక సహాయం అందించాలని. కరెంటు స్తంభాలు విరిగిపోవడం వల్ల బండ్రుగొండ, దంతెలబోర, గంగదేవిగుప్ప, గొల్లగూడెం, దంతెలబోర ఎస్సీ కాలనీ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం నిలిచిపోయిందని. విరిగిపోయిన స్తంభాల స్థానంలో వెంటనే కొత్త స్తంభాలు నాటి త్వరగా ఆ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అనుబంధ రైతు సంఘం మండల నాయకుడు కోలేటి రాంబాబు, నారాయణరావుపేట సర్పంచ్ బండ సరస్వతి, ప్రశాంత్. దంతేలబోర ఎస్సీ కాలనీ గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు