సాయిబాబా ఆలయానికి రూ.3.5 లక్షల రథం బహూకరణ

24-09-2026 | 09:57pm

బూర్గంపాడు,సెప్టెంబర్24(విజయక్రాంతి): మండలంలోని సారపాకలోని షిరిడి పుష్కర ద్వారక సాయిబాబా ఆలయానికి ఇరవెండి గ్రామానికి చెందిన తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్‌ ట్రస్టు(Talluri Panchaksharayya Charitable Trust) ఆధ్వర్యంలో రూ.3.5 లక్షల విలువైన రథాన్ని గురువారం బహుకరించారు. ట్రస్టు ఛైర్మన్‌ తాళ్లూరి పంచాక్షరయ్య, డైరెక్టర్‌ వల్లూరిపల్లి వంశీకృష్ణ–విజయరేణుక దంపతులు ఆలయాన్ని దర్శించుకుని రథాన్ని ఆలయ కమిటీ బాధ్యులకు అందజేశారు.

తమ కుమారుడు, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌–నీలిమ దంపతుల సౌజన్యంతో రథాన్ని సమకూర్చినట్లు పంచాక్షరయ్య తెలిపారు. కార్యక్రమంలో సింగమనేని భాస్కరరావు, తీగల జీవన్‌రెడ్డి, ఊటుకూరి రమణమూర్తి, అక్కెర భాస్కరాచారి, కొత్తపల్లి సత్యనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు