శ్రీ కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్ర పూజలు

01-11-2026 | 06:15pm

నేరేడుచర్ల నవంబర్ 1 (విజయక్రాంతి): శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆదివారం నేరేడుచర్లలోని శ్రీ కోదండ రామాలయం(Sri Kodanda Ramalayam)లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారి కొలచిన దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు వేదమంత్రాలతో సాంప్రదాయ సిద్ధంగా ఆవు పాలు, ఆవు నెయ్యి, పంచదార, గంధం,తేనె, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు చేసి పూలమాలలతో పూలతో  ప్రత్యేకంగా అలంకరించారు, నీరాజనా మంత్రపుష్పం తీర్థ ప్రసాద వినియోగం చేశారు.

పునర్వసు నక్షత్రం సందర్భంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ ధర్మకర్తలు రాచకొండ రామచంద్రరావు, రాచకొండ మధు, రాచకొండ నాగ మాధవరావు, రాచకొండ నరేష్, ఆలయ కమిటీ చైర్మన్ కొణతం సత్యనారాయణ రెడ్డి, చింతకుంట్ల పూర్ణచంద్రారెడ్డి, తాటికొండ వెంకటరెడ్డి, తాటికొండ సత్యనారాయణ రెడ్డి, జెట్టి వెంకన్న, నిమ్మగడ్డ సుబ్బారావు, కొప్పు లక్ష్మీనారాయణ గౌడ్, తడకమళ్ళ పరమేశం, చల్లా వెంకటేశ్వరరావు, తాటికొండ నర్సిరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు