కృత్రిమ అవయవాల పనితీరును పరిశీలించిన పోచారం భాస్కర్ రెడ్డి..

05-10-2026 | 11:11pm

బాన్సువాడ, అక్టోబర్ 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో కృత్రిమ అవయవాలను వినియోగిస్తున్న లబ్ధిదారుల పనితీరును సోమవారం మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి(Former DCCB Chairman Pocharam Bhaskar Reddy) స్వయంగా క్షేత్రస్థాయిలో వారి ఇంటి వద్దకు వెళ్లి వాటి పనితీరు, ఉపయోగంలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కృత్రిమ అవయవాల ద్వారా లబ్ధిదారులకు అందుతున్న సహాయాన్ని పరిశీలించిన ఆయన, వాటి వినియోగంతో వారి దైనందిన జీవనంలో కలుగుతున్న మార్పుల గురించి తెలుసుకున్నారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కృత్రిమ అవయవాలు మరింత సౌకర్యవంతంగా, ఉపయోగకరంగా ఉండేలా అవసరమైన సహకారం అందించాల్సిన ప్రాధాన్యతను ఈ సందర్భంగా ప్రస్తావించారు. దివ్యాంగులకు అండగా నిలిచి, వారి స్వావలంబనకు తోడ్పడే కార్యక్రమాలు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. భాస్కర్ రెడ్డి తమ ఇంటికి రావడంతో యాదగిరి, కరణ్, మహమ్మద్ కుటుంబ సభ్యులు ఆనందంతో స్వాగతం పలికారు. తమ జీవితాల్లో మళ్లీ ఆశను నింపి, కొత్త జీవితాన్ని అందించినందుకు భాస్కర్ రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు