ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి

05-10-2026 | 11:07pm

కలెక్టర్ రాహుల్ శర్మ 

భూపాలపల్లి, అక్టోబర్ 05 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 85 దరఖాస్తులు స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసి, సత్వరం పరిష్కరించాలని సూచించారు. పరిష్కార చర్యల వివరాలను ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఆర్వో వసంత, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు