ప్రధాన రహదారిపై గుంతల పూడ్చివేత..
05-10-2026 | 11:21pm
ములకలపల్లి, (విజయక్రాంతి): ఇటీవల వచ్చిన తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఆర్ అండ్ బి రహదారి దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. సీతారాంపురం గ్రామపంచాయతీ పరిధిలో పాతూరు సమీపంలో పాల్వంచ ములకలపల్లి ప్రధాన ఆర్ అండ్ బి రహదారిపై భారీ గుంతలు ఏర్పడి వాహనా చోధకులు ప్రయాణించడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సోమవారం సీతారాంపురం సర్పంచ్ కుంజా రవి(Sarpanch Kunja Ravi) కాంక్రీట్ మిల్లర్ యంత్రం ఏర్పాటుచేసి సిమెంటు కాంక్రీట్ మిశ్రమంతో రహదారిపై ఏర్పడిన గుంతలను పూడిపించారు. పంచాయతీ పరిధిలోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.