బదిలీపై వెళ్తున్నఎక్సైజ్‌ సీఐ రమ్యారెడ్డికి వీడ్కోలు

12-09-2026 | 01:29pm

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 12 (విజయ క్రాంతి): భూపాలపల్లి ఎక్సైజ్‌ సీఐ రమ్యారెడ్డి బదిలీపై వెళ్తున్న సందర్భంగా తెలంగాణ గౌడ సంఘం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రమ్యారెడ్డిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. 

ఈ కార్యక్రమంలో నేరేడుపల్లి సర్పంచ్‌ శ్రీపతి తిరుపతి గౌడ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ తాళ్లపల్లి సురేందర్‌ గౌడ్‌, ముత్యాల రాజబాబు గౌడ్‌, మల్లంపల్లి సొసైటీ అధ్యక్షుడు తాళ్లపల్లి సదయ్య గౌడ్‌, తాళ్లపల్లి శ్రీనివాస్‌ గౌడ్‌, తాళ్లపల్లి మధుసూదన్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు