అనాథాశ్రమంలో సునీత జయంతి.. చిన్నారులకు అన్నదానం!

01-11-2026 | 07:13pm

రాయినిగూడెం ఫీల్డ్ అసిస్టెంట్ సునీత జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం

గరిడేపల్లి, నవంబర్ 1 (విజయక్రాంతి): ఇటీవల మృతి చెందిన గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ధరావత్ సునీత జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం కోదాడలోని శనగల రాధాకృష్ణ స్వచ్ఛంద సేవా సంస్థ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

గరిడేపల్లి మండల ఫీల్డ్ అసిస్టెంట్ల అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సైదాబీ రంజాన్, అప్పన్నపేట ఫీల్డ్ అసిస్టెంట్ బచ్చలకూరి సతీష్ బాబు ఆధ్వర్యంలో అనాథాశ్రమంలోని చిన్నారులకు అన్నదానం చేశారు. దివంగత సునీత జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం పట్ల ఆశ్రమ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేసి, నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సుధాకర్, రమాదేవి, వెంకట్‌రెడ్డి, బానోతు పున్నం, స్వామిదాసు, మేకపోతుల సరిత, ఎల్లమ్మ, అనిత, గోపినాథ్, శ్రీను, సుజాత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు