రైతులు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలి

30-09-2026 | 08:32pm
  1. చైర్మన్ గంటా సుధాకర్ రెడ్డి
  2. స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

గరిడేపల్లి, సెప్టెంబర్ 30,(విజయ క్రాంతి): రైతుల అభివృద్ధి లక్ష్యంగా గడ్డిపల్లి రైతు సేవ సహకార సంఘం(Gaddipalli Farmers Service Cooperative Society) పనిచేస్తుందని, రైతులు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సంఘం చైర్మన్ గంట సుధాకర్ రెడ్డి తెలిపారు. మండలంలోని గడ్డిపల్లిలో బుధవారం జరిగిన రైతు సేవా సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో  ఆయన మాట్లాడుతూ స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణ సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రైతులకు అవసరమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు పొందేందుకు బడ్జెట్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. అర్హత కలిగిన రైతులు సంఘం కార్యాలయంలో సంప్రదించి రుణ సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు.

రైతుల ఆర్థికాభివృద్ధికి సహకార సంఘం ద్వారా అందిస్తున్న సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. రుణాలను వ్యవసాయ అవసరాలకు సద్వినియోగం చేసుకొని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రైతులకు అవసరమైన సహకారం అందించేందుకు రైతు సేవా సహకార సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని  తెలిపారు. సమావేశంలో సంఘం సభ్యులు, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు