పదవీ విరమణ పొందిన శంకర్‌కు ఘన సన్మానం

30-09-2026 | 09:20pm

విద్యారంగానికి ఆయన సేవలు చిరస్మరణీయం: ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి జీవన్ రాథోడ్

నాగల్‌గిద్ద,(విజయక్రాంతి): నాగల్‌గిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School)లో ఆంగ్ల భాషా ఉపాధ్యాయుడిగా సేవలందించిన ఎం.శంకర్ పదవీ విరమణ(M.Shankar Honored) సందర్భంగా మంగళవారం ఆత్మీయ వాతావరణంలో ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ సంఘం(Teachers Association) నాయకులు, సహచర ఉపాధ్యాయులు ఆయనకు శాలువా కప్పి, పూలమాలలు వేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ ఉపాధ్యాయ ప్రస్థానంలో శంకర్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని నాయకులు కొనియాడారు.

విద్యార్థుల్లో క్రమశిక్షణ, మంచి విలువలను పెంపొందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవన్ రాథోడ్, నాగల్‌గిద్ద మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి శివ షెట్టి, జిల్లా ఉపాధ్యక్షుడు డెవిసింగ్, జిల్లా నాయకులు కాశీరాం, రాజ్‌కుమార్, కర్ణాకర్, పవన్‌తో పాటు ఉపాధ్యాయ సంఘం నాయకులు, సహచర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు